ఆంధ్రప్రదేశ్

andhra pradesh

weather_report_today_in_ap

ETV Bharat / videos

ముంచుకొస్తున్న మిగ్‌జాం తుఫాను​ - నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం - ఆంధ్రప్రదేశ్​ వాతావరణం ఈ రోజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 10:25 AM IST

Updated : Dec 5, 2023, 5:34 PM IST

Weather Report Today in AP :బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇవాళ అర్ధరాత్రికి ఇది తుఫానుగా మారుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది నెల్లూరుకు ఆగ్నేయంగా 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 710 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాతంలోకి తీవ్ర వాయుగుండం వస్తుందని ఐఎండీ తెలిపింది. సోమవారం మధ్యాహ్నానికి దక్షిణ కోస్తాంధ్ర -దక్షిణ తమిళనాడు తీరాలకు చేరువగా తుఫాను వస్తుందని ఐఎండీ తెలిపింది. ఈనెల 5వ తేదీన నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో 80-90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వచ్చే మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. 

Tufan Alert In Nellore District :ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో తుఫాన్ ప్రభావంతో అలలు ఎగిసి పడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాలెం, మైపాడు, కోడూరు తీరంలో అలలు ఎగిసిపడటంతో మత్స్యకారులు బోట్లను దూరంగా భద్రపరుచుకున్నారు. సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది. తుఫాను హెచ్చరికలతో నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతంలోని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు. తీర ప్రాంత మండలాల్లో తహసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Last Updated : Dec 5, 2023, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details