ఆంధ్రప్రదేశ్

andhra pradesh

water_resources_department_engineers_demanding_in-_promotion

ETV Bharat / videos

తక్షణమే పదోన్నతులు కల్పించాలి - జలవనరుల శాఖ ఇంజినీర్ల ధర్నా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 12:22 PM IST

Water Resources Department Engineers Demanding In Promotion: న్యాయబద్దంగా ఇవ్వాల్సిన పదోన్నతులను తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లకు సంబంధించిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఈఎన్సీ నారాయణ రెడ్డికి విజ్ఞాపన పత్రం అందించారు. తక్షణమే తెలంగాణా తరహాలో తాత్కాలిక పదోన్నతులైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జలవనరుల శాఖలో కొందరు ఉన్నతాధికారులు సీనియర్లను కాదని జూనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించటం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను కూడా కొందరు అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆక్షేపించారు. పదోన్నతులు కల్పించే అంశంపై కొంతసేపు ఉన్నతాధికారులకు, ఇంజనీర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  

 గత 1975 నుంచి రాజ్యాంగ బద్ధంగా వస్తున్న జోనల్ వ్యవస్థ ప్రకారం ఇప్పటి వరకు ప్రమోషన్లు ఇచ్చారు. 6సంవత్సరాల క్రితం ఈ ప్రమోషన్లను రద్దు చేసి వెర్టికల్ సీనియారిటీ అని కొత్త విధానం పెట్టారు. దానికి కోర్టు మాత్రం జోనల్ వ్యవస్థనే రాజ్యాంగ బద్ధం చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు చెప్పినట్లు అమలు చేయకుండా దానిని అడ్డుకుంటున్నారు. రాష్ట్రం మొత్తంగా సుమారు 3వేల మంది ఇంజినీర్ల పదోన్నతులు గత  6సంవత్సరాలుగా ఆగిపోయాయి. అధౌక్ ప్రమోషన్లు ఇవ్వమని సీఎంకీ విన్నవిస్తే ప్రమోషన్లు ఇవ్వమని ఆర్డర్లు కూడా ఇచ్చారు. సీఎం ఆదేశాలను కూడా కొంత మంది తుంగలోకి తొక్కారు. -తిరుమల రావు, అధ్యక్షుడు, అసోసియేషన్ ఆఫ్ ఇంజినీర్స్

ABOUT THE AUTHOR

...view details