ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YSR_DISTRICT_WATER_PROBLEM IN CPI LEADERS

ETV Bharat / videos

సీఎం సొంత జిల్లాలో నీటి కొరత - కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై సీపీఐ ఎద్దేవా - no rains in andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 10:41 PM IST

YSR DISTRICT WATER PROBLEM :వైఎస్​ఆర్ జిల్లా కమలాపురం మండల పరిధిలోని చదిపిరాళ్లలో సీపీఐ నాయకుల కరవు ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా నీటి కొరతతో  ఇబ్బంది పడుతున్న కరవు జిల్లాగా ప్రకటించలేకపోయారని సీపీఐ నాయకులు ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు జి. ఓబులేసు, రాష్ట్ర వ్యవసాయ సంఘం నాయకుడు రామచంద్రయ్య, సీపీఐ నాయకులు గాలిచంద్ర సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ కరవు ప్రాంతాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చదిపిరాళ్లకు చెందిన ఓ రైతు  తమ గ్రామంలో ఉన్న వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో  500 ఎకరాల్లోనే పంట సాగు చేశారని, మిగిలిన 500 ఎకరాలలో పంట వేయకుండా బీడుగా వదిలేసారని తెలిపారు. సీపీఐ నాయకుడు జి. ఓబులేసు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

రైతుల బ్యాంకు రుణాలను వెంటనే మాఫీ చేసి తిరిగి పంట వేసుకునేందుకు రుణాలు అందించాలని అన్నారు. కరవు సహాయక చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికి 50 కేజీల బియ్యాన్ని అందించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా  పరిశీలించి కరవు జిల్లాగా ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు  సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ సత్యసాయి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు మార్చాలని అన్నారు. ప్రజలను మరిచి.. దుష్ట రాజకీయాల్లో పడి బస్సు యాత్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కమలాపురం రైతులు కరవులో ఉన్నట్లు గుర్తించాలని.. అంతేగాక కడపను ప్రత్యేక  జిల్లాగా ప్రకటించాలని తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్ర బృందాలతో పరిశీలన చేయించి  నిధులు వచ్చేలా  చేయాలన్నాారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు   రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details