Water Levels at Various Projects: ఉద్ధృతంగా గోదావరి, కృష్ణా.. నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు - dhavaleswaram project
Water Levels at Various Projects: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వచ్చి చేరుతున్న నీరుతో.. లక్షల క్యూసెక్కులను కిందకి విడిచిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 2.68 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 2.59 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి లక్షా 24 వేల 818 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 825.9 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 45.53 టీఎంసీలు ఉంది.
ధవళేశ్వరంలో నిలకడగా..: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద నిలకడగా ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 13.9 అడుగులుగా ఉంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం నుంచి కాల్వలకు 4 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.