ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VRA_Strike_In_Mangalagiri

ETV Bharat / videos

చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్నాం : వీఆర్​ఏలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 5:53 PM IST

VRA Strike In Mangalagiri: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపు తెలంగాణ కంటే మిన్నగా పేస్కేల్ అమలు చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదని వీఆర్​ఏలు మండిపడ్డారు. 8 సంవత్సరాలుగా జీతాలు పెరగక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం వద్ద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) ధర్నా నిర్వహించారు. చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీఆర్​ఏలు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఇచ్చిన హామీల మేరకు పీఆర్సీ, 500 రూపాయిల డీఏ, పదోన్నతులు కల్పించి, నామినీలుగా క్రమబద్ధీకరించాలని వీఆర్​ఏలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 20న తర్వాత సమ్మె చేస్తామని వీఆర్​ఏలు తెలిపారు. వీరి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సీసీఎల్ఏ (CCLA) సహాయ కమిషనర్ ఇంతియాజ్ చెప్పారు. ధర్నాలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వీఆర్​ఏ దత్తప్ప మూర్ఛ వ్యాధితో పడిపోగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details