ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vote Awareness Conference of ETV-Eenadu

ETV Bharat / videos

ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సు - ఓటు అవగాహన ఈనాడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 10:26 PM IST

Vote Awareness Conference of ETV-Eenadu: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు చైతన్య సదస్సులు జరిగాయి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఏబీఎం డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కాకినాడ జిల్లాలో సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు నమోదు చైతన్యంపై అవగాహన కల్పించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలోనూ చైతన్య సదస్సు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓటర్ నమోదు కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట సెయింట్ జాన్సన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటరు చైతన్య అవగాహన సదస్సు జరిగింది. 

Vote Awareness in Various Colleges in AP:అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఓటు నమోదు సదస్సు జరిగింది. మంచి పాలనను అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభిస్తుందని ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. ఓటు నమోదుతోనే ప్రజాస్వామ్యం ప్రారంభమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకోకుంటే మృతి చెందినట్లుగా పెద్దలు భావించే వారని ఈనాడు యూనిట్ ఇన్‌ఛార్జ్‌ శ్రీనివాసులు తెలిపారు. ఈ మాట ప్రాధాన్యాన్ని నేటి యువత గుర్తించి ఓటు వేయడానికి వరుస కట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్లే ప్రభుత్వ నిర్మాతలని అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details