Volunteers with YSRCP flags వైసీపీ జెండాలు మోసి స్వామి భక్తిని చాటుకున్న వాలంటీర్లు..! - వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 5:15 PM IST
|Updated : Sep 2, 2023, 7:07 PM IST
Volunteers with YSRCP flags in YSR Vardhanthi: ఉద్యోగులం అనే మాట మర్చిపోయి.. అధికార పార్టీ నేతలపై.. అధికార పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు స్వామి భక్తిని చాటుతునే ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల నుంచి గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్ల వరకు.. ఎవరి స్థాయిలో వారు తమ ప్రతిభ చూపిస్తునే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో వాలంటీర్లు వైసీపీ జెండాలు మోసి స్వామి భక్తిని చాటుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ వాణి ఇంటి దగ్గర్నుంచి.. స్థానిక ఇందిరా కూడలిలోని వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాల్గొన్న పలువురు వాలంటీర్ల చేతిలో వైసీపీ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా గ్రామ వాలంటీర్లు వైసీపీ జెండాలు చేతపట్టుకోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు.