ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వాలంటీర్ల వివాదం

ETV Bharat / videos

Volunteers Controversy: పవన్ వ్యాఖ్యలపై దుమారం.. వైసీపీ, జనసేన పరస్పర ఆందోళనలు - volunteers controversy in AP

By

Published : Jul 11, 2023, 7:19 PM IST

Pawan Kalyan Volunteers Controversy: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. పవన్ చేసిన విమర్శలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదని ఎంపీ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వాలంటీర్లు ఆందోళనకు దిగారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో వాలంటీర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాలంటీర్లు నిరసన తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. గుంటూరు లాడ్జ్‌ సెంటర్‌లో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేయటాన్ని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద జనసేన నిరసన తెలిపింది. కోనసీమ జిల్లా అమలాపురం జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శెట్టి బత్తుల రాజాబాబు ఆధ్వర్యంలో జనసైనికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details