ఆంధ్రప్రదేశ్

andhra pradesh

volunteer

ETV Bharat / videos

'అధికారంలో ఉన్నాం కదా ఆక్రమించేయ్!' - రోడ్డుపై షెడ్డు నిర్మించిన వాలంటీర్ - district news ap

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 1:11 PM IST

Volunteer who Occupied the Road and Built a Shed : అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామంలోని ఓసీ కాలనీలో నివాసం ఉంటున్న గ్రామ వాలంటీరు అమర్​నాథ్ తన వీధిలో సిమెంటు రోడ్డును ఆక్రమించి షెడ్డును నిర్మించుకున్నారు. రోడ్డు పై అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పక్షానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన గ్రామ పంచాయతీ, మండల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Officers Took Action Against the Volunteer :అమర్​నాథ్ తన ఇంటి ముందున్న సిమెంటు రోడ్డును ఆక్రమించి రెండేళ్లు అవుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి భాషాను వివరణ అడిగితే, విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దారిని కొలతలు వేయించి నిర్మాణం పంచాయతీ స్థలంలో ఉంటే తొలగిస్తామన్నారు. షెడ్డును అక్రమంగా నిర్మించినట్లయితే వాలంటీర్​ అమర్​నాథ్​పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details