Potina Mahesh Fire On Cm Jagan: సీఎం జగన్‌కు అల్జీమర్స్.. వైద్యానికి ఆర్థిక సాయం కావాలా..!: మహేష్ - JanaSena leader Mahesh news
Janasena leader Pothina Mahesh sensational comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి ఉందని.. సీఎం వైద్యానికి అధికార పార్టీ నాయకులు పవన్ కల్యాణ్‌ను అభ్యర్థిస్తే.. మూడు వేల మంది కౌలు రైతులకు ఆర్థికసాయం చేసినట్టే సీఎం వైద్యానికి కూడా ఆర్థికసాయం చేస్తారని అన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మంత్రి అంబటి రాంబాబు తన నోరును అదుపులో పెట్టుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు.
సీఎం జగన్‌కు అల్జీమర్స్ వ్యాధి ఉంది.. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికార పార్టీ నాయకులపై, సీఎం జగన్‌పై పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి వైసీపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారన్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో వాలంటీర్ల వ్యవస్థపై లేవనెత్తిన ప్రశ్నలకు ఇప్పటివరకూ వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేకపోతున్నారన్నారు. సీఎం జగన్‌కు అల్జీమర్స్ వ్యాధి ఉందన్న మహేష్.. వైద్యం కోసం ఆర్థికసాయం కావాలంటే కౌలు రైతులకి పవన్ కల్యాణ్ ఆర్థికసాయం చేసినట్టే, సీఎంకి కూడా ఆర్థికసాయం చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ గురించి మాట్లాడేటప్పుడు మంత్రి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ''తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. విదేశాలకి సూట్ కేస్ కంపెనీల ద్వారా డబ్బు తరలించిన వ్యక్తి ఈ సీఎం జగన్.. అందుకే జగన్‌పై 13 సీబీఐ కేసులు, మూడు ఈడీ కేసులున్నాయి. పవన్ కల్యాణ్‌పై పదేపదే విమర్శలు చేసే మీరు పోలవరం ప్రాజెక్ట్ మీద ఏనాడైనా మాట్లాడారా..? బహుళార్థ సాధక ప్రాజెక్టు అని చెప్పి, బ్యారేజ్‌గా మార్చేశారు. మీరా.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేది' అంటూ పోతిన మహేశ్ ఆగ్రహించారు.