ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vishwakarma_Idol_in_Chandrayaan3_Model_in_Semiliguda

ETV Bharat / videos

Vishwakarma idol in Chandrayaan3 Model:ఆకట్టుకుంటున్న చంద్రయాన్ 3 నమూనాలోని.. నవిశ్వకర్మ విగ్రహం - ఏపీ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 5:13 PM IST

Vishwakarma Idol in Chandrayaan 3 Model in Semiliguda : ఆంధ్రా ఒడిశా సరిహద్దులో గల సెమిలిగూడలో చంద్రయాన్ 3 నమూనాలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ విగ్రహం నెట్టింట వైరల్​ అవుతుంది. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా పూజలు నిర్వహిస్తారు. కానీ, ఈ ఏడాది విభన్నంగా చంద్రయాన్ 3 నమూనాలో పూజ మండపాన్ని తయారు చేశారు. ఇప్పటికే చంద్రయాన్ 3 విజయవంతం కావటం వల్ల​..  విశ్వకర్మ ఉత్సవాల్లో ఈ నమూనా ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది. ఈ నమూనాను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

చంద్రయాన్ 3 నమూనాను సెమిలిగూడకు చెందిన బులి మిస్త్రీ బృందం ఏర్పాటు చేశారు. బులి మిస్త్రీ 15 మంది సభ్యులతో కూడిన బృందంతో.. కలప, పైపుల సహాయంతో చంద్రయాన్3, విక్రమ్ ల్యాండర్​, ప్రజ్ఞాన్ రోవర్​​ల నమూనాను తయారు చేశారు. చంద్రయాన్ 3ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రారంభించినట్లే.. ఈ పూజ కార్యక్రమాలను మొదలుపెట్టారు. చంద్రుని మీద విశ్వకర్మ విగ్రహం పెట్టారు. విక్రమ్​ ల్యాండర్ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ABOUT THE AUTHOR

...view details