VHP Dharna at Simhachalam ఇక్కడ పెళ్లి చేస్తే.. రూ.5 వేలు కట్టాల్సిందే! పురోహితులకు రుసుముపై వీహెచ్పీ ఫైర్
Vishwa Hindu Parishad Leaders Agitation: వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మండిపడుతున్నారు. ఇంతకీ అది ఏంటంటే.. పురోహితులు అన్నవరంలో పెళ్లిళ్లు చేస్తే పురోహితులు 5 వేలు రూపాయలు రుసుము చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సింహాద్రి అప్పన్న తొలిపావంచ వద్ద ఆందోళన చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో అర్చకులు, పురోహితుల జీవితం ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పురోహితులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం కావడం ఖాయమని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.