ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP Vishnu Kumar Raju on CM Jagan: చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు: విష్ణు కుమార్‌ రాజు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 7:36 PM IST

Vishnu_Kumar_Raju_Comments_on_CM_Jagan

BJP Vishnu Kumar Raju on CM Jagan రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత విష్ణు కుమార్‌ రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ కన్నా.. ఉత్తర కొరియా నియంత కిమ్‌ నయమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం ఉందనే ప్రచారం వైసీపీ కుట్రనేనని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని విష్ణుకుమార్ రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Vishnu Kumar Raju Comments: చంద్రబాబు అరెస్ట్‌ వెనక బీజేపీ హస్తం ఉందని వైసీపీ చేస్తోన్న ప్రచారంపై.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. ''చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్ర హస్తం ఉందని వైసీపీ చేస్తోన్న ప్రచారం పచ్చి అబద్ధం. ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నించే వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు నాయుడి అరెస్ట్ అత్యంత బాధాకరం. చంద్రబాబు అరెస్ట్ కుట్ర వెనక వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ సహకరిస్తుందని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ప్రజల్లో వైసీపీపై విపరీతమైన అసంతృప్తి పెరిగిపోయింది. 2024 తర్వాత వచ్చే ప్రభుత్వం జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎలా ఉంటుంది..?. కాబట్టి జగన్.. ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మానుకోని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలి.'' అని ఆయన హితవు పలికారు.  

ABOUT THE AUTHOR

...view details