ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ దీపాల వెలుగులో ధగధగ మెరిసిపోతున్న విశాఖనగరం

ETV Bharat / videos

విశాఖలో జీ-20 సదస్సు.. విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న నగరం - విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న విశాఖపట్నం వీడియో

By

Published : Mar 29, 2023, 1:23 PM IST

Visakhapatnam shining in electric lights: విశాఖనగరం విద్యుత్ దీపాలు వెలుగులో ధగధగ మెరిసిపోతోంది. జీ-20 సదస్సు కోసం విశాఖలో పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను అధికారులు చేపట్టారు. ప్రధాన ప్రాంతాలను ఆకర్షణీయంగా కనిపించేందుకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో విశాఖ నగరంలో జీ-20 సదస్సు శోభ ఉట్టిపడుతోంది. సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు నగరంలో బస చేశారు.  అతిథులను ఆకట్టుకునేలా ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. రహదారులు, ఫుట్​పాత్​లను అందంగా తీర్చిదిద్దారు. బీచ్‌ రోడ్డుతో పాటు ప్రధాన కూడళ్లు, నగరంలో మార్గాలన్నీ విద్యుత్‌ దీప కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతునాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జీ-20 సదస్సు కోసం జీవీఎంసీ రూ.130 కోట్లు వెచ్చించి నగరంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేశారు. రాడిసిన్ బ్లూ హోటల్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ఉండే.. బస చేసే హోటళ్లు, సందర్శించే ప్రాంతాల్లో.. రోడ్లు, ఫుట్​ పాత్​లను కొత్తగా నిర్మించి వాటిని రంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details