ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Visakha_Fishing_Harbour_Fire_Accident_Accused

ETV Bharat / videos

సిగరెట్​ వల్లే ఫిషింగ్​ హార్బర్​లో అగ్ని ప్రమాదం: విశాఖ సీపీ రవిశంకర్​ - Visakha Fishing Harbour latest news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 5:02 PM IST

Updated : Nov 25, 2023, 5:16 PM IST

Visakha Fishing Harbour Fire Accident Accused: ఇద్దరు వ్యక్తుల నిర్వాకం వల్లే  విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ (Visakha Fishing Harbour)లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని.. విశాఖ సీపీ(Commissioner of Police) రవిశంకర్‌ తెలిపారు. ప్రమాద వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు నిర్థారించారు. అగ్ని ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు హార్బర్​లో ఉన్న పరిస్థితిని తెలియజేసే సీసీ దృశ్యాలను విడుదల చేశారు. వీటి ఆధారంగా 10 గంటల 50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్థారించారు.

Visakha Fishing Harbour CCTV Footage: విశాఖ ఫిషింగ్ హార్బర్​లో ఉన్న సీసీ పుటేజ్(cc footage) ఆధారంగా ఈ నెల20న వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ఓ బోటులో కూర్చుని మద్యం తాగారని సీపీ తెలిపారు. సిగరెట్ కాల్చి పక్క బోటులోకి విసిరేయడంతో ప్రమాదం జరిగిందన్నారు. పక్క బోటులోని నైలాన్ వలలో సిగరెట్ పడటంతో మంటలు అంటుకున్నాయన్నారు. ఇంజిన్లలో డీజిల్‌ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని వివరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితుడి పేరును పోలి ఉండటంతోనే యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని కూడా పోలీసులు విచారించారని సీపీ తెలిపారు. అతడి ప్రమేయం లేదని తేలడంతో వదిలేశామని రవిశంకర్‌ చెప్పారు. 

ఈ నెల 20న విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 40పైగా బోట్లు అగ్నికి ఆహుతయ్యాయని, సుమారు 25 నుంచి 30 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.

Last Updated : Nov 25, 2023, 5:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details