ఆంధ్రప్రదేశ్

andhra pradesh

visakha_east_mla_criticized_cm_jagan

ETV Bharat / videos

Visakha East MLA Criticized CM Jagan: విశాఖలో భూదోపిడీకే జగన్ రాక.. లక్షల కోట్ల విలువైన దందాకు అంతా రెడీ: ఎమ్మెల్యే వెలగపూడి - విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 5:43 PM IST

Visakha East MLA criticized CM Jagan : విశాఖలో లక్ష కోట్ల విలువైన భూములు దోచుకోవడానికి సీఎం జగన్ విశాఖకు మకాం మారుస్తున్నారని విశాఖ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఎంవీపీ కాలనీలో చేపట్టిన నిరసన శిబిరం 32వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖలో రూ.40 వేల కోట్ల భూములు సీఎం జగన్ అనుచరులు దోచుకున్నారని ఆరోపించారు. 

రూ.25 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారని వెల్లడించారు. పెద్దజాలారిపేట, బిలాల్ కాలనీల్లో వేల కోట్ల టీడీఆర్ తెచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ విశాఖ సర్క్యూట్ హౌస్ కూడా ప్రైవేట్ భూమిగా టీడీఆర్ తేడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విశాఖ మాస్టర్ ప్లాన్ వీఎమ్​ఆర్​డీఏ సిద్ధం చేయలేదని, విజయసాయి రెడ్డి ఆఫీసులో సిద్ధం చేశారని చెప్పారు. విశాఖలో లక్ష కోట్ల భూదందాలకు సీఎం జగన్ సిద్ధం అవుతున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details