తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - VIPs in Tirumala Srivari
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 2:07 PM IST
VIPs Visited Tirumala Srivari Darshan :తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి, భారతీయ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, భారాస ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ప్రముఖ గాయని మంగ్లీలు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.
నిన్న తిరుమల శ్రీవారిని 58,415 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 18,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.55 కోట్ల రూపాయల వచ్చింది.
నిన్న తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్, మంత్రి రోజా, ఎంపీ కేశినేని నాని, విశాఖ ఎమ్మెల్యే గణబాబు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.