ఆంధ్రప్రదేశ్

andhra pradesh

YCP MLA Bolla Sensational Comments

ETV Bharat / videos

'తక్కువ అంచనా వేయొద్దు.. సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా' - ycp mla bolla brahma Naidu sensational comments

By

Published : Apr 7, 2023, 11:39 AM IST

YCP MLA Bolla Sensational Comments:  ప్రతిపక్ష నేతలు తనను తక్కువగా అంచనా వేస్తే తప్పు చేసినట్టేనని.. సమయం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానంటూ.. పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు జరగబోయే ఎన్నికలు మాములివి కాదని.. గతంలో కూడా చూసి ఉండరని.. ఇకపైన చూడబోరని.. ఎమ్మెల్యే తెలిపారు. అన్నింటికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన ఆయన.. బతికి ఉంటే తాను గెలవాలని.. లేకుంటే తన బాధ్యత కాదని వ్యాఖ్యనించారు. కారంపూడి రోడ్డులోని బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంలో "మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి వైఎస్సార్​ కాంగ్రెస్​ సచివాలయ కన్వీనర్లు, నాయకులకు మాత్రమే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసారి తనపై పోటీ చేయాలంటే భయపడేంతగా ఎలక్షన్ చేస్తానని, ప్రాణం వదలడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జీవితంలో ఒకసారన్నా  ఎమ్మెల్యే అయితే చాలనుకున్నానని.. కానీ ఇప్పుడు జగన్​తో దృఢమైన బంధం ఏర్పడ్డాక వదిలి వెళ్లడానికి మనసు అంగీకరించడం లేదని పేర్కొన్నారు. తాను ముందుంటానని..తన వెంట చాలని గృహసారథులు, సచివాలయ కన్వీనర్లను, వైసీపీ నాయకులను కోరారు. తనను నమ్ముకున్న వారిని వదలబోనని, వచ్చే ఎన్నికల్లో 40 వేల నుంచి 50 వేల ఆధిక్యంతో గెలవడం ఖాయమని బొల్లా జోస్యం చెప్పారు.

 

ABOUT THE AUTHOR

...view details