Vinayaka Chavithi Celebrations వినాయక చవితి వేళా.. సందడిగా మారిన మార్కెట్లు - నెల్లూరు జిల్లా లోకల్ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 2:29 PM IST
Vinayaka Chavithi Celebrations in Nellore : రాష్ట్ర వ్యాప్తంగా వినాయకచవితి సందర్భంగా సందడి నెలకొంది. పండుగ వేళా గణపతిని ప్రత్యేకంగా ఆలకరించేందుకు ప్రజలు వివిధ పూజ సామగ్రిలు కొనటానికి మార్కెట్లకు వెళ్లారు. దీంతో పండగ సందర్భంగా మార్కెట్ సెంటర్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు ప్రజలతో కిటకిటలాడాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఇష్టంగా ఈ పండగను జరుపుకుంటారు.
పండగ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఆదివారం నుంచే సందడి నెలకొంది. నగరంలోని ప్రధాన వీధులు ప్రజలతో కిటకిటలాడాయి. వినాయక విగ్రహాలను, పూజ సామగ్రిని కొనుగోలు చేయటానికి వచ్చే ప్రజలతో ప్రధాన కూడళ్లు రద్దీగా మారాయి. ఉదయం నుంచి కూడా జిల్లాలోని ఏసీ మార్కెట్ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్ హౌస్ పేట, ముత్తూకురు గేటు సెంటర్లు ప్రజలతో సందడిగా ఉన్నాయి. కరోనా వచ్చిన తరవాత ఈ సంవత్సరం బాగా జరుపుకుంటామని, వ్యాపారస్థులకు మంచిగానే ఉందని, కాకపోతే పూల ధరలే ఎక్కువగా ఉన్నాయని హోల్ సేల్ వ్యాపారస్థుడు తెలిపాడు.