ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Villagers_Crossing_River_With_Body_for_Funeral

ETV Bharat / videos

Villagers Crossing River With Body for Funeral: అంత్యక్రియల కోసం తీవ్ర ఇబ్బందులు.. మృతదేహాన్ని మోస్తూనే నది దాటిన బంధువులు - తాటితూరు తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 2:02 PM IST

Updated : Sep 26, 2023, 4:20 PM IST

Villagers Crossing River With Body for Funeral: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరులో జరిగిన ఓ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాటితూరు సచివాలయ పరిధిలోని వేములవారి కళ్లాలకు చెందిన వేముల రమణ అనే వ్యక్తి ఈ నెల 23న అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహానికి తాటితూరు బీసీ కళ్లాలలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. వేములవారి కళ్లాల నుండి శ్మశాన వాటికకు చేరాలంటే మధ్యలో గోస్తనీ నదిని దాటాలి. ప్రస్తుతం గోస్తనీ నదిలో నీరు అధికంగా ఉండడంతో.. బంధువులు నడుము లోతు నీటిలోనే మృతదేహాన్ని అవతల ఓడ్డుకు చేర్చారు. పీకల్లోతు నీటిలో నుంచి మృతదేహాన్ని అవతల ఓడ్డుకు తీసుకువెళ్లడం పలువురికి కంటతడి పెట్టించింది. గోస్తనీ నదిపై కాజ్​వే నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు గతేడాది శంకుస్థాపన చేశారని.. దానికి సంబంధించిన పనులు ముందుకు సాగడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించి కాజ్​వే  నిర్మాణం పూర్తి చేయాలని వారు కోరారు.

Last Updated : Sep 26, 2023, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details