ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Villagers_Concerned_Irregularities_took_in_Cyclone_Funds

ETV Bharat / videos

'తుపాను బాధితులకు అందించే నిధుల్లోనూ అధికారుల చేతివాటం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 1:50 PM IST

Villagers Concerned Irregularities took in Cyclone Funds: కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో తుపాను బాధితులకు అందించే సాయంలో అవకతవకలు జరిగాయంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటిమొగ, పేదపాలెం గ్రామాలకు ఏటిమొగ మండలపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాధితులకు డబ్బులు ఇవ్వకుండా అధికారులు ఆలస్యం చేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పునరావాస శిబిరాల్లో మొత్తం 83 కుటుంబాల నుంచి 159 మంది వ్యక్తులు తలదాచుకున్నారు. వీరిలో 63 కుటుంబాలకు తుపాను సహాయం అందింది. 

Officials Committing Fraud in Funds Provided to Cyclone Victims: తుపాను హెచ్చరికలతో ఏర్పాటుచేసిన పునరాావాస శిబిరం గురించి సమాచారం తెలియజేయలేదని, ప్రస్తుతం తుపాను బాధితులకు అందించే సాయం కూడా రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని ఓ బాధితురాలు పేర్కొంది. పునరావాసం పొందిన వారి పేర్లలో (VRO) వీఆర్​ఓ అవకతవకలకు పాల్పడ్డాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు బాధితులు లేఖ రాశారు . పునరావాస కేంద్రంలో తలదాచుకున్న తమకు సహాయం అందించాలని విన్నవించారు.  

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details