ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గ్రామానికి నీటి సప్లై

ETV Bharat / videos

Water Supply: ఊరికి నీళ్లొచ్చాయి.. పండగను తీసుకొచ్చాయి - tribals celebrated water supply to village

By

Published : Apr 18, 2023, 12:54 PM IST

Water Supply: ఆ ఊరంతా సందడి.. ఎటుచూసినా పండగ వాతావరణం.. సినిమా సెట్​ను తలపించే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. ముగ్గులు, బిందెల తోరణాలు, చీరల పరదాలతో ఆ గ్రామం ముస్తాబయింది. ఇంతగా ఆ గ్రామాన్ని అలంకరించడానికి కారణం.. ఆ పేద గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరింది. గ్రామానికి మంచి నీరు వచ్చాయి.. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దుచ్చెరపాలెంలో.. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. గ్రావిటీ ద్వారా గ్రామానికి మంచి నీరు అందించారు. ఎన్నో ఏళ్లుగా తమను పట్టి పీడిస్తున్న నీటి సమస్య తీరటంతో ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. వాటర్‌ ట్యాంక్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గిరిజనులు పండగలా నిర్వహించారు. ఊరిని చీరలతో, నీటి బిందెలతో అలంకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఏజెన్సీ వ్యాప్తంగా 450 మంచినీటి పథకాలు అందజేశామని శ్రీ సత్యసాయి సేవాసంస్థల ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details