ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vijayawada_MP_Kesineni_Nani_DISHA_Review_Meeting

ETV Bharat / videos

Vijayawada MP Kesineni Nani DISHA Review Meeting: మూడు నెలల్లో అనుకున్న పనులు పూర్తి చేయాలి.. దిశా మీటింగ్​లో కేశినేని - ఎన్టీఆర్​ జిల్లా తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 5:13 PM IST

Vijayawada MP Kesineni Nani DISHA Review Meeting: ప్రధాన్​మంత్రి ఆవాస్​ యోజన కింద ఎన్టీఆర్ జిల్లాకు సుమారు 88వేల ఇళ్లు మంజూరు చేస్తే.. అందులో ప్రస్తుతానికి 18వేలు మాత్రమే నిర్మాణం జరిగాయని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా దిశ కమిటీ సమావేశం జరిగిందని ఆయన అన్నారు. కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు దిశ కమిటీ సమావేశం నిర్వహించలేదని కేశినేని తెలిపారు. ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒక్కసారి దిశ కమిటీ  సమావేశం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదని నాని తెలిపారు. ఈ మీటింగ్​లో చర్చించిన అంశాలకు సంబంధించిన పనులు.. మూడు నెలల తరువాత.. దిశ కమిటీ సమావేశం జరిగే నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు నాని తెలిపారు. ఈ మూడు నెలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు, పథకాల పని తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు కేశినేని నాని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details