Vijayawada Court on Triple Murder Case: ట్రిపుల్ మర్డర్ కేసును కొట్టేసిన బెజవాడ కోర్టు..
Vijayawada Court on Triple Murder Case: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుట్‌పల్లి వద్ద 9 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ముగ్గురు హత్య కేసును సాక్ష్యాలు లేవంటూ బెజవాడ కోర్టు కొట్టివేసింది. రెండు కుటుంబాల్లోని విభేదాల కారణంగా హత్యలు జరిగాయి. తొలుత జరిగిన హత్యకు ప్రతీకారంగా నడిరోడ్డుపై ముగ్గురిని కిరాయి హంతక ముఠా తుపాకీలతో కాల్చి చంపింది. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిందితులకు హత్యకేసు నుంచి విముక్తి లభించింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినికడిమికి చెందిన భూతం గోవింద్, గంధం నాగేశ్వరరావు కుటుంబాలు జ్యోతిష్యం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014 ఏప్రిల్ 6న భూతం దుర్గారావు హత్య జరిగింది. దీనికి ప్రతీకారంగా దుర్గావు కుటుంబ సభ్యులు దిల్లీ నుంచి షార్పు షూటర్లను రప్పించి ప్రత్యర్థి కుటుంబంలోని ముగ్గరిని హత్య చేయించింది. ఈ హత్య కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో విజయవాడ కోర్టు కేసును కొట్టివేసింది.