Vijayawada Bhavani Island: నాడు కళకళ.. నేడు వెలవెల..! భవానీ ద్వీపం దుస్థితిపై పర్యాటకుల ఆవేదన - NTR District Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 7:49 PM IST
Vijayawada Bhavani Island: కృష్ణానది మధ్యలో అందమైన ఓ ద్వీపం..! అందులో ఓ ద్వీప స్తూపం, రోబోటిక్ జురాసిక్ పార్క్, పక్షుల ప్రదర్శనశాల.. ఇలాంటి ఎన్నో చూడాల్సిన ప్రదేశాలున్న సుందరమైన పర్యాటక ప్రాంతం. కొంత కాలం క్రితం వరకూ ఆ ఆహ్లాదకరమైన ప్రదేశం.. పర్యాటకుల సందడితో కళకళలాడుతూ ఉండేది. అయితే ఆ ద్వీప అందాలకు మరింతగా సొబగులు దిద్దాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. విస్మరించడంతో.. అంతా తారుమారైంది. అధికారుల నిర్లక్ష్య వైఖరితో ద్వీప స్తూపం కూలేందుకు సిద్ధమైంది. జురాసిక్ పార్కు, పక్షుల సందర్శనశాల చాలా వరకు మూతపడ్డాయి. ద్వీపంలో ఆహ్లాదంగా గడిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై స్పందించి భవానీ ద్వీపాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. ఆలనాపాలనకు దూరమైన విజయవాడకు సమీపంలోని భవానీ ద్వీపం దుస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తున్న పరిశీలనాత్మక కథనం మీకోసం..