ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vijayawada_ACB_Court_Notices_to_TDP_Leader_Nara_Lokesh

ETV Bharat / videos

నారా లోకేశ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు - నారా లోకేశ్​కు నోటీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 10:48 AM IST

Vijayawada ACB Court Notices to TDP Leader Nara Lokesh :తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జనవరి 9కి వాయిదా వేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41-A నిబంధనలను ఉల్లంఘించారని నారా లోకేశ్‌పై అరెస్టు ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఇటీవల పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్​పై న్యాయస్థానం విచారణ జరిపింది.

దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు :అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ నిందితుడిగా ఉన్నారని తాము జారీ చేసిన షరతులకు లోబడి వ్యవహరించడంలో ఆయన విఫలం అమయ్యారని సీఐడీ పేర్కొంది. సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించినందున అరెస్టుకు కోర్టు అనుమతి కోరుతున్నట్లు పేర్కొంది. సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం లోకేశ్‌కు నోటీసులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details