Vijayawada ACB Court Hearing on CBN Mulakat Petition: చంద్రబాబుతో రోజుకు 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు - chandrababu news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 20, 2023, 3:52 PM IST
|Updated : Oct 20, 2023, 7:35 PM IST
Vijayawada ACB Court Hearing on CBN Mulakat Petition: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జైలులో ములాఖత్‌ల సంఖ్య పెంచాలంటూ.. ఆయన (చంద్రబాబు) తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై.. విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరిగింది. చంద్రబాబుతో రోజుకు 2 లీగల్ ములాఖత్‌లు ఇవ్వాలని ఏసీబీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కోర్టుల్లో చంద్రబాబుకు సంబంధించి పిటిషన్ల విచారణ దృష్ట్యా ఆయన లాయర్లు ములాఖత్ కోరారు. రోజుకు మూడు సార్లు ములాఖత్‌కు అవకాశమివ్వాలన్నారు. గతంలో రెండు నుంచి ఒక ములాఖత్‌కు తగ్గించారని తెలిపారు. అన్ని వివరాలు పరిశీలించిన కోర్టు రోజుకు రెండు ములాఖత్‌లు ఇవ్వాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Fibernet Case: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. అనంతరం న్యాయమూర్తి విచారణను నవంబర్ 10కి వాయిదా వేశారు.