ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vijay_Diwas_Celebration_in_Visakhapatnam

ETV Bharat / videos

విశాఖలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు - అమర వీరులకు నివాళులర్పించిన తూర్పు నౌకాదళం - Navy Ceremonies in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 2:40 PM IST

Vijay Diwas Celebration in Visakhapatnam : తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. 1971లో పాకిస్థాన్ పై యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని విజయ్ దివస్ జరుపుతారు. విశాఖ బీచ్ రోడ్ లో విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద అమర సైనికులకు అధికారులు నివాళులర్పించారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడి శత్రువుల మీద విజయం సాధించి జాతీయ పతాకాన్ని ఎగరేసిన రోజు ఇది. ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబరు 16న త్రివిధ దళాలు విజయ్‌ దివస్‌ నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. 

ఈ సందర్బంగా విజయ్ దివస్​ను విశాఖలో తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. భారతదేశం 1971లో పాకిస్తాన్ ​పై యుద్ధంలో విజయానికి నౌకదళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ రోజున త్రివిధ దళాలు ఆయాచోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి తూర్పు నౌకాదళం సిబ్బంది హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details