Veterinary Assistant Suicide Attempt మూడు ఆర్బీకేలకు ఇంఛార్జ్.. ఆపై బీఎల్వోగా నియమాకం.. తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం
Veterinary Assistant Suicide Attempt in Anantapur: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్యపాలెం సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడు(వెటర్నరీ అసిస్టెంట్)గా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం చేశారు. శనివారం ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు RBK లకు ఇంఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనాథ్ ను BLO గా విధులు నిర్వర్తించాలని అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశుసంవర్థక శాఖ, వ్యవసాయ శాఖ ఉద్యోగులను శాఖేతర పనులకు ఉపయోగించుకోకూడదని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ జీవో ప్రకారం తనను బీఎల్ఓ విధులకు దూరంగా ఉంచాలని తహశీల్దార్‌ను కోరగా.. అందుకు ఆయన ఒప్పుకోలేదని సమాచారం. అలాగే RBKవిధుల్లో పని ఒత్తిడి ఉందని శ్రీనాథ్ చెప్పినా అధికారులు వినిపించుకోకుండా అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన శ్రీనాథ్ తాను నివాసముంటున్న గదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. శ్రీనాథ్ ను స్థానికులు గుంతకల్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మైరుగైన చికిత్స కోసం వైద్యులు అనంతరపురం ఆస్పత్రికి తరలించారు.