'చెత్త'లో కలిసిన వాహనాలు - లక్షల రూపాయల ప్రజాధనం వృథా - ఎస్సీ కార్పొరేషన్ ఎలక్ట్రికల్ వాహనాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 4:39 PM IST
Vehicles are Rusty Non Distribution of YCP Govt: రాష్ట్రంలో చెత్త అంశం వివాదంగా మారినట్లు కనిపిస్తోంది. చెత్తపై పన్ను, చెత్తను తీసుకెళ్లే వాహనాల డ్రైవర్లు వేతనాల కోసం నిరసనలకు దిగడం మాములుగా మారింది. ఈ సమస్యలు చాలవన్నట్లు.. గత టీడీపీ(TDP) హయాంలో కొనుగోలు చేసిన చెత్త వాహనాలను.. వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో అవి తుప్పు పట్టాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Distribution Stopped Due to Election Code: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని గ్రామాలకు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ భారత్ కింద 15 ఎస్సీ కార్పొరేషన్ ఎలక్ట్రికల్ వాహనాలు(electrical vehicles sanctioned) మంజూరయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే కొద్ది రోజులు ముందే వాహనాలు రావడం వల్ల వాటి పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటి పంపిణీ మరిచారు. దీంతో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోనే అవి తుప్పు పట్టిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా వాటిని పంపిణీ చేయకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పనికి వచ్చే వాహనాలను కొద్దిపాటి రిపేరుతో.. రోజువారి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. సుమారు రూ. 50 లక్షల మేర ప్రభుత్వ ధనం వృథా అయిందని స్థానికులంటున్నారు.