కరవు పరిస్థితులు మారిపోవాలని జంబుకేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం - దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన కాపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 12:29 PM IST
Varuna Yagam in Anantapur District: వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాయదుర్గం పట్టణంలోని పురాతన శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గురువారం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ,రెడ్‌క్రాస్ ఛైర్మన్ దంపతులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరుణ యాగం జరిపించారు.
Due to Lack Of Rainfall: అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో వర్షాలు లేక రైతులు సాగుచేసిన వరి, వేరుశనగ తదితర పంటలు ఎండి పోతున్నాయి. వరుణుడి కరుణ కోసం రామచంద్రారెడ్డి పేద బ్రాహ్మణుల చేత హోమం, రుద్ర, చండి యాగం, గో, గంగా పూజ, మహాగణపతి, కలశ స్థాపన, సహస్ర ఘట్టాభిషేకం, వరుణ జపం, సూర్య నమస్కారం, మహాగణపతి, వరుణ హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా జంబుకేశ్వరుడిని నీటిలో ముంచి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, మున్సిపల్ ఛైర్పర్సన్ పొరాళు శిల్పి, ఈవో నరసింహారెడ్డి, వెంకటేశ్వరస్వామి, ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ భోజరాజనాయక్, భక్తులు పాల్గొన్నారు.