ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Varla_Ramaiah_Issued_a_Press_Statement

ETV Bharat / videos

Varla Ramaiah Issued a Press Statement : దళితుల పట్ల వివక్ష దారుణం.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజు : వర్ల - AP Latest News

By

Published : Aug 21, 2023, 12:22 PM IST

Varla Ramaiah Issued a Press Statement :దళితులకు ఆలయ ప్రవేశ నిరాకరణ జగన్ నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనమని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య  ధ్వజమెత్తారు. తిరుపతి జిల్లా గొల్లపల్లిలో.. ప్రోలక్షమ్మ దేవాలయంలోకి  దళితులను  ప్రవేశించకుండా అడ్డుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తూ.. పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులో ఉన్న సమాచారం ప్రకారం.. 77ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో దళితుల పట్ల  చిన్న చూపు చూడటం దారుణమన్నారు. వైసీపీ అరాచక పాలనలో బలహీన వర్గం అణగారిపోతోందని.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చీకటి రోజుగా తెలుగుదేశం పార్టీ భావిస్తోందని తెలిపారు. మన రాజ్యంగం భారత పౌరులందరికి సమాన హక్కులు కల్పిస్తోందని.. నచ్చిన మతాన్ని అనుసరించే హక్కును ప్రసాదించిందన్నారు. కానీ గొల్లపల్లి గ్రామ దళితులకు రాజ్యాంగం, ప్రాథహక్కులు వర్తించకపోవడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఘటనపై ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితులను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పూజారులు, ఈ ఘటనతో ముడిపడి ఉన్న సంబంధిత వ్యక్తులు, వీరి వెనుక ఉన్న  వైసీపీ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందుతులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details