Vangaveeti Radha Krishna Marriage: నరసాపురానికి అల్లుడు కాబోతున్న వంగవీటి రాధా.. పెళ్లి ఎప్పుడంటే..! - వంగవీటి రాధాకృష్ణ వివాహం
Vangaveeti Radha Krishna Marriage: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. వంగవీటి రాధాకృష్ణకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జీల రెండో కుమార్తె పుష్పవల్లితో వివాహం ఖరారైంది. ఈ విషయాన్ని పుష్పవల్లి తండ్రి బాబ్జీ ధ్రువీకరించారు. ఈ నెల 19న రాధా – పుష్పవల్లి నిశ్చితార్థం చేయాలని నిర్ణయించినా.. కొన్ని కారణాలతో అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో తేదీ నిర్ణయిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, వంగవీటి రంగ కుమారుడిగా వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.