Vangalapudi Anitha made Allegations on YCP Leaders: తప్పు చేయలేదు.. అందుకే చంద్రబాబు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారు: వంగలపూడి అనిత - ap news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 17, 2023, 8:37 PM IST
|Updated : Sep 18, 2023, 6:35 AM IST
Vangalapudi Anitha made allegations against Minister Roja: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం వైసీపీ నేతల ఆరోపణలు... మీడియా సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందిస్తున్న తీరుపై... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. జగన్.. అతిపెద్ద ఆర్థిక నేరస్థుడని ఆరోపించారు. 11 ఏళ్లుగా జగన్ బెయిలుపై బయట ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కుటుంబంలా కాకుండా... చంద్రబాబు కుటుంబసభ్యులు ఎంతో ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. తప్పు చేయకపోవడం వల్లే చంద్రబాబు కుటుంబసభ్యులు ధైర్యంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయలేదు.. క్వాష్ పిటిషన్ వేశారని అనిత వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏమీ లేదని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడని ఆమె ఎద్దేవా చేశారు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలని మంచి సంకల్పంతో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రవేశపెట్టనట్లు అనిత తెలిపారు. చంద్రబాబు వల్ల లాభపడిన యువత... నేడు బాబుతో మేము అంటూ రోడ్లపైకి వస్తున్నారని తెలిపారు. అది వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని అనిత ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వు కుంటున్నాడని అనిత ఆరోపించారు. ఆరు నెలలు ఆగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని అనిత వెల్లడించారు. అప్పుడు వైసీపీలో ఉండే వారు ఎవ్వరో అర్థం అవుతుందని అనిత ఎద్దేవా చేశారు. సీఎం జగన్ దగ్గర పనిచేస్తున్న కొందరి అధికారుల చిప్‌లు దొబ్బాయని, ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు వందల కోట్లు దొచుకున్నారని ఆరోపిస్తున్నారని అనిత మండిపడ్డారు. ఇంటర్ మీడియట్ ఫైల్ అయిన రోజా.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన బ్రాహ్మణి గురించి మాట్లాడే ముందు తన స్థాయిని తెలుసుకోవాలని హితవు పలికారు.