ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Anitha_on_Chandrababu_Security

ETV Bharat / videos

Vangalapudi Anitha Fires on Ministers About Chandrababu Security: చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి ఈ మంత్రులు ఎవరు..?: అనిత - tdp Vangalapudi Anita commets

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2023, 5:51 PM IST

Vangalapudi Anitha Fires on Ministers About Chandrababu Security: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భద్రత విషయంలో వైఎస్సార్సీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, డీజీపీ మౌనంపై.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. చంద్రబాబు భద్రతపై మాట్లాడటానికి ఈ మంత్రులు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి వాళ్లకేం తెలుసని మాట్లాడుతున్నారు..? అని నిలదీశారు. చంద్రబాబు భద్రతపై మంత్రుల వ్యాఖ్యలు, డీజీపీ మౌనం ప్రభుత్వ కుట్రలో భాగమనే అనుమానం కలుగుతోందని అనిత ఆరోపించారు.

Vangalapudi Anitha Comments: రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుతూ..శుక్రవారం నాడు విజయవాడ కనకదర్గమ్మను వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ''స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబు ఆర్థిక నేరస్థుడైతే.. 16 నెలలు జైల్లో ఉండి.. 45వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్‌ చేసిన సీఎం జగన్ ఏమవ్వాలి..?. చంద్రబాబు భద్రతపై మంత్రుల వ్యాఖ్యలు, డీజీపీ మౌనం ప్రభుత్వ కుట్రలో భాగమే. చంద్రబాబుకి సరైన భద్రతలేదని, ఆయన ప్రాణాలకు ముప్పుఉందని ఆయన సతీమణే చెబుతున్నా.. డీజీపీ ఎందుకు నోరెత్తడం లేదు..?. ప్రజాగ్రహం పెల్లుబుకి, 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే.. ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయగలదు..?. వైసీపీ ప్లెక్సీలకు కాపలా ఉన్నప్పుడే పోలీసులు ఎంత దిగజారిపోయారో అర్థమైంది. 16 నెలలు జైల్లో ఉండివచ్చి, బెయిల్‌పై రాష్ట్రాన్ని పాలిస్తూ, 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఈ జగన్ రెడ్డి అమూల్ బేబీనా..?. ఏ తప్పూ చేయని చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదా..?. భారతి రెడ్డికి ఢిల్లీకోర్టు నోటీసులు పంపితే రోజా సంబరాలు చేయదేం. పోలీసులు లేకుండా బయటకు వస్తే మహిళా మంత్రికి టీడీపీ చేపట్టింది బందో..బొందో'' అని ఆమె అన్నారు.

ABOUT THE AUTHOR

...view details