Simhachalam: సింహాద్రి అప్పన్న ఆలయంలో వైభవంగా వైశాఖ పౌర్ణమి వేడుకలు - AP Latest News
Simhachalam: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వైశాఖ పౌర్ణమి ఉత్సవం వైభవంగా జరుగుతోంది. మినీ చందనోత్సవంగా భావించే ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా వరాహ పుష్కరణలో పుణ్య స్థానం ఆచరించి అనంతరం గరిడీలతో స్వామివారి మెట్ల మార్గంలో కాలినడకన స్వామి దగ్గరికి చేరుకొని దర్శనం చేసుకున్నారు స్వామి దర్శనానికి ముందు వంటావార్పు చేసుకుని స్వామి ప్రతిమను ప్రతిష్టించుకునే నైవేద్యం పెట్టి అనంతరం స్వామి దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఈ వైశాఖ పౌర్ణమని మినీ చందన యాత్రగా దేవస్థానం అధికారులు పరిగణిస్తారు. స్వామివారి వరాహ పుష్కరణలో చేసిన ఏర్పాట్లకు భక్తులు తమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏడు ఇలాగే ఏర్పాట్లు చేయాలని దేవస్థానాన్ని కోరుకున్నారు. చందనోత్సవం రోజున తొలి విడత చందన సమర్పణతో గుమ్మడి పండు రూపంలో అనుగ్రహించిన అప్పన్న స్వామి తాజాగా రెండో విడత చందన అలంకరణతో నిండుగా దర్శనం ఇచ్చారు.