UTF Dharna Against Teachers Transfers ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి: యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి - irregularities in teachers transfers
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 10:30 PM IST
UTF Dharna Against Teachers Transfers: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను తక్షణం నిలుపుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణ బదిలీలు జరిగి రెండు మాసాలు గడవకముందే ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అక్రమ బదిలీలు నిర్వహించడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ బదిలీలను నిరసిస్తూ కడప జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఉపాధ్యాయుల పైరవీలకు తలొగ్గి కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో అడ్డదారిలో అక్రమ బదిలీలు నిర్వహించడం సరైనది కాదని మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. 75 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి రహస్య ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమ బదిలీలను రద్దుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. లేకపోతే అక్రమ బదిలీలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
TAGGED:
UTF Dharna