ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Teachers Complaint on Urdu Academy Chairman

ETV Bharat / videos

Urdu Teachers Complaint on Academy Chairman: ఉర్దూ ఉపాధ్యాయులకు కోపం వచ్చింది.. అకాడమీ ఛైర్మన్ తీరుపై తీవ్ర ఆరోపణలు - andhra pradesh urdu academy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 9:16 PM IST

Updated : Sep 20, 2023, 10:40 PM IST

Urdu Teachers Complaint on Academy Chairman విజయవాడలోని.. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ప్రాంగణంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉర్ధు పాఠశాలల్లో పని చేస్తున్న ఉర్దూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఉర్దూ అకాడమి భవనంలో.. ఛైర్మన్ హెచ్ నదీమ్ అహ్మద్​ను నిలదీశారు. దీంతో ఛైర్మన్​కు, ఉర్దూ ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది. ఉర్దూ అకాడమీ ఛైర్మన్​గా నదీమ్ అహమ్మద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు.. తమ సమస్యలను పరిష్కరించకపోగా వేధింపులకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఉర్దూ ఉపాధ్యాయులు వాపోయారు. ఈ రోజు ప్రశ్నించేందుకు వెళ్తే తమను బెదిరించారని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తన పదవీ కాలం ముగిసినా.. ఇంకా ప్రభుత్వ సౌకర్యాలను వినియోగిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. అంతేగాక అడ్మినిస్టేటివ్ డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ ఆయుబ్ పదవీ కాలం పూర్తైనా వెళ్ళకుండా తమపై పెత్తనం చేలాయిస్తున్నారని ఉర్దూ ఉపాధ్యాయలు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీని ప్రక్షాళన చేయాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Last Updated : Sep 20, 2023, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details