ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Union_Ministers_Visit_to_AP

ETV Bharat / videos

రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పర్యటన-పలు అభివృద్ధి పనులకు శ్రీకారం - విశాఖపట్నంలో అశ్విని వైష్ణవ్ కుమార్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 2:03 PM IST

Union Ministers Visit to AP :రాష్ట్రంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రెండు రోజులు పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం దిల్లీ నుంచి కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. నిర్మలా సీతారామన్​కి రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కేంద్రమంత్రి విజయవాడ బయలుదేరి వెళ్లారు. అనంతరం రాయనపాడు గ్రామానికి వెళ్లి, భారత్ సంకల్ప్ యాత్ర (Bharat Sankalp Yatra) ప్రారంభించనున్నారు.రేపు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనం జరుగుతుంది.  ఈ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు.

Central minister Ashwini Vaishnav Kumar Started Development Works :విశాఖపట్నం సింహాద్రి అపన్న స్వామిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవి అశోక్ అశోక్‌ కుమార్‌ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్థంభంను ఆలింగనం చేసుకొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత సాయంత్రం విమానంలో దిల్లీ బయలుదేరి వెళతారు.

ABOUT THE AUTHOR

...view details