Union Minister Giriraj Singh on YSRCP Govt ఏపీలో జరిగిన అభివృద్దిలో అధిక శాతం నిధులు కేంద్రానివే: కేంద్ర మంత్రి - Union Minister Giriraj Singh comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 22, 2023, 5:14 PM IST
Union Minister Giriraj Singh on YSRCP Govt: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధిలో అధిక శాతం నిధులు కేంద ప్రభుత్వానివేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే.. తమ ప్రభుత్వమే అభివృద్ధి చేసినట్లుగా ముఖ్యమంత్రి ప్రచారం చేసుకోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న సహాయ, సహకారాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
Giriraj Singh Comments:కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్బంగా తిరుపతిలోని గాంధీభవన్‍లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. ''ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలను కోరుతున్నాను. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మా ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారు. అది సరైంది కాదు. కేంద్ర సహకారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు..?. కేంద్ర సహకారం ఉన్న ప్రతి పథకంలో మోదీ ఫోటోను ముద్రించాలి. శ్రీజ పాల కంపెనీకి కేంద్రం సహకారం అందిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదు..?, ఆ పాల కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే 2 లక్షల మంది మహిళలు ఆర్థిక పురోగతిని సాధిస్తారు.'' అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.