ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ షాక్​తో రెండేళ్ల చిన్నారి మృతి

ETV Bharat / videos

Electric Shock: విద్యుత్ షాక్​తో రెండేళ్ల చిన్నారి మృతి..

By

Published : Jun 11, 2023, 7:38 PM IST

Two Years Old Child Electric Shock: అనంతపురం జిల్లా గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్​తో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఊబిచర్ల గ్రామంలో సంతోష్ అనే చిన్నారి తన ఇంటి పరిసరాల ప్రాంతాలలో ఆడుకుంటుండగా.. విద్యుత్ స్తంభానికి ఉన్న స్టాటర్ బాక్స్​ తగిలి కరెంట్ షాక్​కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటా హుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదకర ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్టాటర్ బాక్స్​పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details