ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two_Votes_For_YSRCP_MLA_Family_Members

ETV Bharat / videos

వైసీపీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు బంపర్ ఆఫర్ - ఒక్కొక్కరికి రెండు ఓట్లు! - fake votes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 12:03 PM IST

Two Votes For YSRCP MLA Family Members :రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వందల కొద్దీ దొంగ ఓట్లను చేరుస్తున్నారని,  తెలుగుదేశం నేతలు ఫిర్యాదులు చేస్తున్నాఅధికారులు పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తూ.. వైఎస్సార్సీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. దీంతో దొంగ ఓట్ల చేర్పుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది మరువక ముందే వైసీపీ ఎమ్మెల్యే కుటుంబానికి రెండు ఓట్లు ఉండటం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Double votes in AP :ఓటరు జాబితాల్లో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం పరిపాటిగా మారింది. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. శ్రీశైలం నియోజక వర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబ సభ్యులకు ఆత్మకూరు, అలాగే నంద్యాలలో ఓట్లు ఉన్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డి సతీమణి భాగ్యలక్ష్మి, కుమారుడు కార్తీక్ రెడ్డి, కూతురు శ్వేత రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details