ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసం

ETV Bharat / videos

Exchange notes Fraud: రూ.10 లక్షలకు ఆశపడి.. రూ.90 లక్షలు పోగొట్టుకున్నారు - మోసం

By

Published : Jun 26, 2023, 7:31 PM IST

Fraud in the name of exchange of notes: రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి పేరుతో ఇద్దరు వ్యక్తులు 90 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రూరల్ ఎస్ఐ సింహాచలం వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసకు చెందిన ఎ. అనిల్.. వి. అనిల్​తో కాకినాడ, భీమవరం ప్రాంతాలకు చెందిన ఇతర వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. 90 లక్షల రూపాయలకు సంబంధించి 500 నోట్లు ఇస్తే.. కోటి రూపాయలు విలువ చేసే రెండు వేల రూపాయలు నోట్లు అందిస్తామని ఆశ చూపారు. దీంతో ఆ ఇద్దరూ స్నేహితుల వద్ద అప్పు చేసి మరీ 90 లక్షల రూపాయలను పార్వతీపురం మండలంలో అందజేశారు. కాగా, రూ.2వేల నోట్లు వేరే చోట ఉన్నాయి.. ఇస్తాం రమ్మని చెప్పి ఆగంతకులు పరారయ్యారు. బాధితులు ఈనెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కాకినాడ, భీమవరానికి చెందిన వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details