ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బెడిసికొట్టిన సలహా! - తుపాకీతో అప్పులోళ్లకు చెక్ పెడదామనుకుని పోలీసులకు బుక్కయ్యాడు - అప్పుతీసుకుని తుపాకీతో బెదిరింపు అనంతపురం

🎬 Watch Now: Feature Video

Two Persons Arrest With Gun in Ananrhapur District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 5:12 PM IST

Two Persons Arrest With Gun in Ananrhapur District :ఎవరైనా అప్పు తీసుకొని సమయానికి కట్టలేకపోతే అప్పులిచ్చిన వారికి కనబడకుండా తప్పించుకోవడం... లేదా రేపో, మర్నాడో ఇస్తా అని చెప్పడం చూసి ఉంటారు. కానీ, రాప్తాడు నియోజకవర్గం ఇటుకల పల్లిలోని ఓబులేషు అప్పులిచ్చిన వారికి ప్రాణభయం పుట్టించడానికి సిద్ధపడ్డాడు. పలువురి వద్ద  రూ. 30లక్షల  అప్పు చేశాడు ఓబులేషు. సకాలంలో తిరిగి ఇవ్వలేకపోవటంతో అప్పులిచ్చిన వారి నుంచి అతడిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ విషయం రాప్తాడులోని తన స్నేహితుడు కన్నయ్యకు చెప్పాడు.  

Man Wanted to Threaten Borrowers With Gun in Rapthadu : ఇంట్లో తుపాకీ పెట్టుకుంటే అప్పులవాళ్లను బెదిరించవచ్చని సలహా ఇచ్చిన కన్నయ్య... ఓబులేషును పిలుచుకొని వెళ్లి తనకు తెలిసిన వ్యక్తి నుంచి సింగిల్ బ్యారెల్ తుపాకీ ఇప్పించాడు. ఓబులేషు తుపాకీని ఇంట్లో ఉంచుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఓబులేషు ఇచ్చిన సమాచారంతో  అతనికి సహాయం చేసిన కన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓబులేషుకు తుపాకీ విక్రయించిన మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పిన జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలుపుతూ, కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details