ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Current_ Shock_ Two_ Farmers_ Dead_

ETV Bharat / videos

తోటవల్లూరులో విషాదం - విద్యుత్ షాక్​ తగిలి ఇద్దరు రైతులు మృతి - current shock news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 3:39 PM IST

Updated : Nov 7, 2023, 4:38 PM IST

Two Farmers Died with Electrocution: కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలంలో విద్యుత్ షాక్​ తగిలి ఇద్దరు రైతులు మృతి చెందారు. తోటవల్లూరు మండలం లోని పాములంక గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు తోట పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలినట్లు గ్రామస్థులు తెలిపారు. సోమవారం పసుపు తోట సాగుకు వెళ్లిన రైతులు విజయాంబ, చిరంజీవి తిరిగి ఇంటికి చేరుకోక పోవడంతో అనుమానం వచ్చిన పాములంక గ్రామస్థులు.. అర్ధ రాత్రి తోటకు వెళ్లి చూశారు. అక్కడ ఇద్దరు రైతులు విగత జీవులుగా పడి ఉన్నారు.

పసుపు తోట లోకి పశువులు రాకుండా రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచెను చూసు కోకుండా దాటిన రైతులు,.. కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. సమాచారం అందుకున్న తోటవల్లూరు పోలీసులు మంగళ వారం ఉదయం ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Nov 7, 2023, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details