ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two_Farmers_Died_by_Hit_Electrical_Wire

ETV Bharat / videos

అడవి పంది కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ -ఇద్దరు రైతులు మృతి - two were died touching wild pig electric wire

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 12:42 PM IST

Two Farmers Died by Hit Electrical Wire: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో విషాదం నెలకొంది. పొలానికి వెళ్లిన ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన నాగరాజు(35) అతని మేనమామ నరసింహరావు(42) కలిసి సోమవారం తుమృకోట సమీపంలో ఉన్న పొలంలో మోటారు వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మోటరు వేసేందుకు ప్రయత్నిస్తుండగా అడవి పంది కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నాగరాజు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ,ఖాళీ సమయాల్లో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు.

Uncle Nephew Died in  Palnadu: నాగరాజు తండ్రి  అయ్యప్ప మాల ధరించి, సోమవారం ఇరుముడి కట్టుకుని దర్శనానికి శబరిమలకు బయలుదేరారు. ఇరుముడి కార్యక్రమం చూసేందుకు నరసింహారావు వచ్చారు. అనంతరం పొలానికిి వెళ్లిన నాగరాజు అతని మేనమామను విద్యుత్తు తీగే యమపాశమై వీరి ప్రాణాలు బలి తీసుకుందని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details