Two Persond Died in krishna river కృష్ణా నదిలో ఈతకు వెళ్లి.. వరుసగా మృత్యువాత పడుతున్న యువత - విజయవాడలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు
Two People Died: కృష్ణా నదిలో వారం రోజుల వ్యవధిలో నలుగురు యువకులు మరణించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఈత కోసమని వెళ్లిన యువకులు మృత్యువాత పడుతున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన విజయవాడకు సమీపంలోని యనమలకుదురుకు చెందిన 15 ఏళ్ల రత్న రాకేశ్, జాన్ బెనియన్ అనే ఇద్దరు యువకులు కృష్ణానదిలో గల్లంతై ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటన మరవక ముందే అదే ప్రాంతానికి చెందిన బాలాజీ, సాయితేజ అనే మరో ఇద్దరు యువకులు ఆదివారం మరణించారు. ఏడుగురు యువకులు కృష్ణానదికి స్నానం కోసం వెళ్లారు. ఐదుగురు ఫొటోలు దిగుతుండగా ఇద్దరు స్నానం చెయ్యడానికి నదిలోకి దిగి గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారం రోజుల పరిధిలోనే నలుగురు యువకులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.