ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Twist_in_YSRCP_Leaders_attack_on_Constable_Case

ETV Bharat / videos

Twist in YSRCP Leaders attack on Constable Case: కానిస్టేబుల్​పై వైసీపీ నేతల దాడి కేసులో ట్విస్ట్.. విత్ డ్రాకు రాధమ్మ - YSRCP Leaders attack on Constable

By

Published : Aug 10, 2023, 10:54 PM IST

Twist in YSRCP Leaders attack on Constable Case: అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వైసీపీ నాయకులు మహిళా కానిస్టేబుల్​పై దాడిచేసిన కేసు కొత్త మలుపు తిరిగింది. బుధవారం సాయంత్రం 92 మద్యం బాటిళ్లు తరలిస్తూ అనంతపురంలో వైసీపీ నాయకుడు పట్టుబడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని సెబ్ పోలీస్ స్టేషన్​కు తరలించగా, వైసీపీ కార్పొరేటర్ చంద్రతో పాటు మరికొందరు వార్డు వాలంటీర్లు.. సెబ్ పోలీస్ స్టేషన్​లో మహిళా కానిస్టేబుల్​పై దాడి చేశారు. దీనిపై కానిస్టేబుల్ రాధమ్మ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు అదే రోజు రాత్రి ఇచ్చిన ఫిర్యాదు గురువారం వెనక్కు తీసుకోవటానికి వెళ్లటంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసినందున వెనక్కు తీసుకునే అవకాశం ఉండదని సీఐ చెప్పటంతో ఆమె కంటతడి పెట్టుకొని తిరిగి వెళ్లిపోయారు. కాగా ఈ కేసు.. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించటమే కాకుండా దాడి చేసినట్లు మీడియాలో పెద్దఎత్తున ప్రసారమైంది. అయితే అనంతపురం రెండో పట్టణ పోలీసులు మాత్రం బెయిలబుల్ కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి అదే రోజు రాత్రి నిందితులను పంపించారు. అయితే.. అధికార పార్టీ నాయకులు ఓ ప్రజాప్రతినిధి అండతో పోలీస్ అధికారుల ద్వారా ఫిర్యాదుదారు రాధమ్మపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలువస్తున్నాయి. 

మండిపడ్డ జనసేన పార్టీ నేతలు: అనంతపురం నగరంలో అధికార పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని జనసేన పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారంటూ భూ కబ్జాలే కాకుండా, మహిళా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. నగరంలోనే వైసీపీ నాయకులు, కార్ప`రేటర్లు బెల్టు షాపులు నిర్వహిస్తూ, అడ్డుకున్న సెబ్ పోలీసులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details