ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tungabhadra_Upper_Canal_Collapse-at_Kolagal

ETV Bharat / videos

Tungabhadra Upper Canal Collapse at Kolagal : కర్ణాటకలో తుంగభద్ర ఎగువకాలువకు గండి.. ఆందోళనలో అన్నదాతలు - ఏపీ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2023, 4:04 PM IST

Tungabhadra Upper Canal Collapse at Kolagal: కర్ణాటకలోని 78వ కిలోమీటర్ కొలగల్లు వద్ద తుంగభద్ర ఎగువ కాలువకు గండి పడింది. ఫలితంగా ఆంధ్రసరిహద్దు అనంతపురం జిల్లా బొమ్మనహళ్ వద్ద నీటిమట్టం తగ్గింది. హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు కింద రైతులు వరి నాట్లు వేసి 40 రోజులు అవుతోంది. కానీ నీరు లేకపోవడం వల్ల వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీటి వనరుగా  తుంగభద్ర జలాశయం ఉంది. ప్రస్తుతం కొలగల్లు వద్ద గండి పడటం వల్ల నీరంతా వృధాగా పోతోంది. దీంతో అప్రమత్తమైన తుంగభద్ర  బోర్డు అధికారులు జలాశయం నుంచి హెచ్ఎల్సీకి  నీటి విడుదలను నిలిపివేశారు. అధికారులు వెంటనే కర్ణాటకలో ఏర్పడిన గండిని పూడ్చివేసి, నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. గతంలో ఆంధ్ర సరిహద్దులోని ఉంతకల్ సమీపంలో హెచ్​ఎల్సీకి పడిన గండిని అధికారులు యుద్ధప్రాతిపదికన ఇసుక బస్తాలతో పూడ్చివేశారు.  

ABOUT THE AUTHOR

...view details