కరవు తీవ్రతను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం : తులసిరెడ్డి - ఏపీలో కరవు న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 6:39 PM IST
Tulasi Reddy on Identification of Drought Zones in AP: కరవు తీవ్రతను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 449 మండలాలు కరువుతో అల్లాడుతుండగా.. కేవలం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయమన్నారు. కరవు మండలాల ప్రకటన కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై వైసీపీ ప్రభుత్వం పునః పరిశీలన జరిపి 449 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
"కరవు తీవ్రతను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో 449 మండలాలు కరువుతో అల్లాడుతుండగా.. కేవలం 103 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయం. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సర్కారు పునః పరిశీలన జరిపి 449 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలి." - తులసిరెడ్డి, పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్